వైభవంగా శ్రీవారి స్నపన తిరుమంజనం
భాగవత పారాయణం, తీర్థోత్సవం భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రిగుట్ట లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఆలయ అర్చకులు స్వామి వారికి స్నపన తిరుమంజన కార్యక్రమంను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ భగవత్ క్రియలో భాగంగా అర్చకులు పదవ రోజున శేషహోమంను నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ మూర్తులను పల్లకిలో పుష్కరణి వరకు మంగళ వాయిద్యాలతో తీసుకొని వచ్చి స్వామి వారి ఎదుట పంచ కలషములను అర్చకులు ప్రతిష్టింపజేశారు.పసుపు జలం గల కలశంతో, పంచ కలశములలోని జలంతో స్వామి వారిని స్నానమాచారింప జేశారు....