26.2 C
Hyderabad
Monday, August 3, 2026

సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులను అభ్యసించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం స్థానిక తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల ను సందర్శించారు. తొలుత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Take advantage of the facilities and pursue higher studies

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల డైట్ చార్జీలు పంచడం జరిగిందని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను అభ్యసించే విధంగా చదువుకోవాలని అన్నారు. ఐ.ఐ.టీ., ట్రిపుల్ ఐ.టీ. లో సీటు సాధించే విధంగా కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా చదువుతో పాటు, క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినం ను పురస్కరించుకొని నేడు జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.

Take advantage of the facilities and pursue higher studies

ప్రతీ విద్యార్థి కష్టపడి చదవాలని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ మాట్లాడుతూ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, కష్టపడి చదివి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు. అంతకుముందు స్కావుట్ విద్యార్థులు కలెక్టర్ కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్, ఆర్.ఎల్.సి. ఆర్. కిరణ్ గౌడ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సలాం, ప్రిన్సిపాల్ ప్రణిత, పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Take advantage of the facilities and pursue higher studies

More articles

Latest article