సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులను అభ్యసించాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం స్థానిక తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల ను సందర్శించారు. తొలుత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి...