25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

  • డ్రంక్ అండ్ డ్రైవ్ లో కఠినంగా వ్యవహరిస్తాం
  • నిజామాబాద్ రూరల్ ఎస్సై ఆరిఫ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నగరంలో ఉండే ఆరు పోలీస్ స్టేషన్లో కంటే రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి చాలా పెద్దగా ఉంటుందని రూరల్ ఎస్సై ఆరిఫ్ అన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోసామాన్యులకు రక్షణ కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని, శాంతి భద్రతల విషయంలో ఉపేక్షించేది లేదని ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఏంతటి వారైనా చట్టం ముందు నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా తమ సిబ్బందితో కలిసి అన్ని ప్రధాన కూడళ్లలో తగిన తనిఖీలు చేపట్టి తరచుగా ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపడతామనిఆయన అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారు ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ప్రజల రక్షణ కల్పించడమే తమ ధ్యేయమని, తమ పై అధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని ఆయన అన్నారు. తమ స్టేషన్ పరిధిలో ఎవరికైనా అన్యాయం జరిగితే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి నిర్భయంగా ఎవరి బెదిరింపులకు గురికాకుండా ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఎస్ఐ భరోసా కల్పించారు.

The aim is to maintain peace and security

More articles

Latest article