26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా సిఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్ , బతుకమ్మ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం (గాంధీ భవన్‌)లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలలొ పాల్గొని రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు రాష్ట్ర నలుమూలాల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం గాంధీభవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ పూలతో అందంగా అలంకరించబడింది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతోపాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు.వేడుకల సందర్భంగా విద్యార్థులతొ కలిసి భారీ కేక్ కట్ చేయడం విశేష ఆకర్షణగా నిలిచాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం లొ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తుందని పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేశారు.

పాల్గొన్న తొండకూర్ మాజీ సర్పంచ్ దశ గౌడ్
ఈ కార్యక్రమనికి నందిపేట్ మండలం తొండకూర్ మాజీ సర్పంచ్ దశ గౌడ్ హాజరయ్యారు. ఆయన రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, పార్టీతోపాటు ప్రజాసేవకు ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వం లొ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత విజయవంతమైన భవిష్యత్తు ఉందని ఆకాంక్షించారు.

CM Revanth Reddy's birthday celebrations are grand

More articles

Latest article