25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్వాస మీద ధ్యాసే ధ్యానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ముప్కాల్: ముప్కాల్ మండలం నాగంపేట గ్రామంలో పి ఎస్ ఎస్ ఎమ్ ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని పత్రీజీ జన్మదిన వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ధ్యానం వల్ల ఆనందం ఆరోగ్యం ప్రతి ఒక్కరు ధ్యానం చేసి శాకాహారం భుజించాలని మూగజీవాలను సంరక్షించాలని ఏ జీవిని కూడా హింసించరాదని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్ఞానదాతగా తెలంగాణ రాష్ట్ర ధ్యానగద్దర్ భూపతి రాజు విచ్చేసి అద్భుతమైన ధ్యాన జ్ఞాన అందించారు.మారుమూల గ్రామాల్లో సైతం ఇంత పెద్ద సంఖ్యలో హాజరై శాఖాహార ర్యాలీలు నిర్వహించడం ధ్యాన జ్ఞాన.కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. నాగం పేట గ్రామంలో రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి, ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్, కోశాధికారి సుఖాల లక్ష్మణ్, ప్రేమ్ సాగర్,సాయినాథ్ చిదుర రాజు, డీకొండ శ్రీనివాస్, మీసాల శ్రీనివాస్, అమృత రావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article