24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్ర బడ్జెట్ లో కల్లుగీత కార్మికులకు 5000 కోట్లు కేటాయించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కోయడి నర్సింహులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

రాష్ట్ర బడ్జెట్లో గీతా కార్మికుల సంక్షేమానికి 5000 కోట్లు కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కోయడి నర్సింహులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గీత కార్మికులకు కొత్త పెన్షన్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ని 4000 చేయాలని, ఎక్స్ గ్రేషియా ను 10 లక్షలకు పెంచాలని, అలాగే సేఫ్టీ కిట్స్ ఇవ్వాలని తీర్మానం చేశారు. ఈ సమస్యల పరిష్కారానికై మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ లో జరిగే మహా ధర్నా, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేజీకేఎస్ జిల్లా కార్యదర్శి చిడుగు శేఖర్ గౌడ్, కోశాధికారి శ్రీరాం గౌడ్, సాయగౌడ్, వివిధ గీత వృత్తి సంఘ ప్రతినిధులు ఎనుగందుల మురళి, నారా గౌడ్ శ్రీనివాస్, కృష్ణాగౌడ్, రమేష్ గౌడ్, రాంరాజ్, కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

5000 crores should be allocated for the Kallu Geeta workers in the state budget

More articles

Latest article