29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నందిపేట్ పీహెస్ సీ ని తనిఖీ చేసిన జల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

. . . సీనియర్ అసిస్టెంట్ కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశం

 

నందిపేట్, బతుకమ్మ :

 

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నందిపేట లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, జనరల్ వార్డులు, ఫార్మసీ, ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు.

 

Trust in government hospitals should be enhanced.
Trust in government hospitals should be enhanced.

 

సీనియర్ అసిస్టెంట్ గణేష్ హాజరు పట్టికలో సంతకాలు చేయకపోవడం గమనించిన కలెక్టర్ ఆయన గురించి వాకబు చేశారు. గత మూడు రోజులుగా పీహెచ్ సీకి రాలేదని తెలియడంతో, సీనియర్ అసిస్టెంట్ గణేష్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రతి రోజు ఎంత మంది పేషంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని సూచించారు. గర్భిణీలకు అందిస్తున్న వైద్య సేవలు, ఔషధాల వివరాలను పరిశీలించి కీలక సూచనలు చేశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పని చేయాలని హితవు పలికారు.

 

Trust in government hospitals should be enhanced.
Trust in government hospitals should be enhanced.

More articles

Latest article