25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బీసీ అభ్యర్థులకు 50 శాతం సీట్లను కేటాయించాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారికి వినతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు 50 శాతం సీట్లను కేటాయించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు సరిపోవు కాబట్టి జనరల్ స్థానాల్లో 50 శాతం సీట్లను బీజేపీ పార్టీ కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు కల్పించాలని చూస్తే.. కొందరు బీసీ వ్యతిరేకులు కోర్టుకు వెళ్లడంతో బీసీలకు న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్లు దక్కకుండా పోయాయని అన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో 50 శాతం సీట్లను బీసీ అభ్యర్థులకు కేటాయించాలని కోరారు. దీనిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ తాము జనరల్ స్థానాల్లో సింహాభాగం బీసీలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు జనరల్ స్థానాల్లో సీట్లు కేటాయిస్తానని చెప్పినందుకు బీసీ సంఘం నాయకులు హర్షం వ్యక్తపరిచారు. వినతి పత్రం సమర్పించిన వారిలో బుస్స ఆంజనేయులు, దర్శనం దేవేందర్, శ్రీలత, కొట్టూర్ చంద్రకాంత్, రేఖ, బాలన్న, ఆర్టీసీ శ్రీనివాస్, కర్లం రాములు, నారాయణ, సుదర్శన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article