27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కామారెడ్డి జిల్లా హై పవర్ టెన్షన్ లో 5 కేసుల నమోదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కామారెడ్డి లో 2 కేసులు

 

. . . బాన్సువాడలో 3 కేసులు

 

కామారెడ్డి /బాన్సువాడ క్రైం, బతుకమ్మ :

 

కామారెడ్డి, బాన్సువాడ ఘటనల్లో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని చంపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు కారుతో క్యాంప్ కార్యాలయం ముట్టడికి వచ్చారని బిజెపి పట్టణ అధ్యక్షుడు ఫిర్యాదు మేరకు పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అదే సమయంలో ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి సంబంధించి కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు బిజెపి నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. అలాగే బాన్సువాడ పట్టణంలో గత 24 గంటల్లో మూడు కేసులు నమోదు చేశారు. శుక్రవారం నాడు రిలయన్స్ మాల్ లో సెల్ ఫోన్ లో భక్తి గీతం పెట్టుకోవడాన్ని వీడియో తీసి అవమానకరంగా మాట్లాడాడు. అదే రిలయన్స్ మాల్ లో మరో యువతి తో కూడా అలాగే ప్రవర్తించాడు. శుక్రవారం ఒక యువతి సోదరుడు ప్రశ్నించడాన్ని సంబంధిత వ్యక్తి చేసిన వివాదంపై తొలి కేసు నమోదు అయింది. ఒక వర్గానికి చెందిన దుకాణాలపై రాళ్లూరువి గొడవలు సృష్టించిన 42 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శనివారం బాన్సువాడ బంద్ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై ఒక షాప్ యజమాని వ్యవహరించిన తీరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాన్సువాడ పట్టణంలో సెక్షన్ 163 అమలులో ఉన్న సమయంలో జరిగిన వివాదాల కారణమైన పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

More articles

Latest article