బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు చేయాలి
బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా, బతుకమ్మ :బీసీ వర్గాలకు హామీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్‌ను చట్టబద్ధంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బీసీ నేత కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మంగళవారం సిరిసిల్ల లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “కామారెడ్డి బహిరంగ సభలో అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు...