23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

3.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

Must read

📰 Generate e-Paper Clip

  • రాష్ట్రంలో తృతీయ స్థానం
  • 90 శాతం  కొనుగోలు పూర్తి
  • 735 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు
  • గతేడాది తో పోలిస్తే జోరుగా  కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు
  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : జిల్లాలో 2024-25 రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు జోరుగా కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 446 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వార ఇప్పటి వరకు 58655 మంది రైతుల నుండి 735 కోట్ల  విలువైన 3.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ తో రాష్ట్రం లో కామారెడ్డి  జిల్లా  తృతీయ స్థానం లో నిలిచిందనీ తెలిపారు. దీంట్లో 1.49 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 1.67 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు 44204 రైతులకు గాను 616.10 కోట్ల వరకు డబ్బులు చెల్లింపులు కూడా పూర్తయ్యాయనీ తెలిపారు. గతేడాది పోలిస్తే అనగా రబీ 2023-24 ఇదే సమయానికి 45068 రైతుల నుండి 2.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయగా, అదేవిధంగా  ఆ క్రిందటి  ఏడాది అనగా రబీ 2022-23 సీజన్ లో 25167 రైతుల వద్ద నుంచి 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ను కొనుగోలు చేశామన్నారు. గత రెండు సీజన్ లతో పోలిస్తే ఈ రబీ సీజన్ లో ధాన్యం కొనుగోళ్ళు, రైతులకు చెల్లింపులు 40% అధికంగా చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు సన్న రకం ధాన్యం అమ్మిన 16109 మంది రైతులకు బోనస్ చెల్లింపులకు రూ.66.23 కోట్లు ప్రభుత్వానికి సిఫార్సు చేశామన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షాలను దృష్టి లో ఉంచుకొని కేంద్రాలలో తగినన్ని టార్పాలిన్ లను ఏర్పాటు చేయాలనీ మార్కెటింగ్ శాఖ వారికి సూచించారు. అలాగే రైతులు తమ వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో  అమ్ముకునే క్రమములో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

More articles

Latest article