22.7 C
Hyderabad

ఉమ్మడి జిల్లాలో ప్రజావాణికి 197 ఫిర్యాదులు

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ జిల్లాలో 115.. కామారెడ్డి జిల్లాలో 82

 

నిజామాబాద్ / కామారెడ్డి, బతుకమ్మ : ఉమ్మడి జిల్లాలో ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి 197 ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్ జిల్లాలో 115, కామారెడ్డి జిల్లాలో 82 ఫిర్యాదులు అందాయి. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓ, నగర పాలక సంస్థ కమిషనర్ లు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

197 complaints to Prajavani in the joint district

More articles

Latest article