25.5 C
Hyderabad

మధ్యాహ్న భోజనం వికటించి 14 మంది విద్యార్థులకు అస్వస్థత

Must read

📰 Generate e-Paper Clip

బీర్కూర్, బతుకమ్మ : మధ్యాహ్న భోజనం వికటించి 14మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలంలో గల రైతు నగర్ లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోజు మాదిరిగానే విద్యార్థులు పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నభోజనం చేశారు. కొద్ది సేపటికే కొందరు విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను హుటాహుటిన బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల పరిస్థతి విషమంగా ఉండటంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోన ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article