- 3,526 మంది వార్డు మెంబర్లు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత బోధన్ డివిజన్ లోని అన్ని మండలాలతో పాటు నవీపేట్ మండలాల్లోని 184 పంచాయితీలకు 1156 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అదే మాదిరిగా 11 మండలాల్లోని 1642 వార్డులకు 3526 మంది అభ్యర్థులు నిలిచినట్లు జిల్లా ఎన్నికల అధికారికి వినయ్ క`ష్ణారెడ్డి తెలిపారు. బోధన్ డివిజన్ లోని బోధన్ మండలంలోని 26 పంచాయితీలకు 132 నామినేషన్లు రాగా చందూర్ మండలంలో 5 పంచాయితీలకు 54, కోటగిరిలో 16 పంచాయితీలకు 105, మోస్రాలో 5 పంచాయితీలకు 35, పోతంగల్ లో 20 పంచాయితీలకు 156, రెంజల్ 17 పంచాయితీలకు 112, సాలురాలో 12 గ్రామ పంచాయితీలో 68, వర్నిలో 23 గ్రామ పంచాయితీలో 114, ఎడపల్లిలో 17 జీపీలో 112 మంది సర్పంచ్ స్థానాలకు బరిలో నిలిచారు. నిజామాబాద్ డివిజన్ లోని నవీపేట్ మండలంలో 32 సర్పంచ్ పోస్టులకు 182 మంది పోటీలో నిలిచారు. వార్డుల విషయానికొస్తే బోధన్ మండలంలో 228 వార్డులలో 421 మంది, చందూర్ లో 48 వార్డులలో 119, కోటగిరిలో 130 వార్డులలో 261, మోస్రాలో 52 వార్డులలో 141, నవీపేట్ లో 288 వార్డులలో 639, పోతంగల్ లో 166 వార్డులలో 333, రెంజల్ లో 166 వార్డులలో 161, రుద్రూర్ లో 100 వార్డులకు 245, సాలురాలో 112 వార్డులలో 246, వర్నిలో 186 వార్డులలో 373, ఎడపల్లిలో 166 వార్డులలో 387 మంది పోటీలో నిలిచారు.
