25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పాత సీసాలో కొత్త మద్యం

Must read

📰 Generate e-Paper Clip

  • నేటి నుంచి కొత్త  లిక్కర్ పాలసీలో సేల్ షూరు
  • కొత్త లైసెన్స్ లు పాత మద్యం వ్యాపారులకే
  • బెల్ట్ షాపులకు జోరుగా వేలం పాటలు
  • పర్మిట్ రూంలకు జోరుగా పైరవీలు
  • ఐఎంఎఫ్ఎల్ డిపో నుంచి 32కోట్ల మద్యం అమ్మకాలు

New wine in an old bottle

నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ ప్రభుత్వం 2025-27 మద్యం పాలసీ ప్రకారం లిక్కర్ సేల్ కు వేళ అయింది. డిసెంబర్ 1 నుంచి కొత్తగా మద్యం లైసెన్స్ లు దక్కించుకున్న వ్యాపారుల ద్వారా మద్యం అమ్మకాలు జరిపేందుకు అబ్కారి శాఖ కసరత్తులు చేస్తుంది. సెప్టెంబర్ 26న  నూతన మద్యం పాలసీని ప్రకటించిన సర్కార్, అక్టోబర్ మాసంలో లక్కీ డ్రాల కోసం టెండర్ లను అహ్వనించిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రూ.130 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. 152 మద్యం దుకాణాలకు సంబంధించిన మద్యం అమ్మకాలకు లైసెన్స్ లు జారీ చేశారు. దాని ప్రకారం మద్యం అమ్మకాలను సోమవారం నుంచి కొత్తగా లక్కీ డ్రాలలో మద్యం లైసెన్స్ లు దక్కించుకున్న వ్యాపారుల ద్వార జరిపేందుకు కసరత్తు జరుగుతుంది.

  • కోట్లు కుమ్మరించి మద్యం లైసెన్స్ లను చెరబట్టి..?

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 152 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో అన్నింటికి కొత్తగా లక్కీ డ్రాల ద్వారా లైసెన్స్ ల కేటాయింపు జరిగింది. చాల మట్టుకు మద్యం లైసెన్స్ లు కొత్త వారికి దక్కలేదు. అసలే భవిష్యత్తులో పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు రెండేళ్లలో జరుగడం ఖాయమని తలంచిన మద్యం వ్యాపారులు లైసెన్స్ లు దక్కించుకునేందుకు ఖర్చుకు వెనుకాడలేదు. మద్యం వ్యాపారం పై గుత్తాధిపత్యం కొందరిదే. అందునా సిండికేట్ ను కాదని మద్యం వ్యాపారం కష్టం. సామాజిక పరంగా గౌడ్స్ తో పాటు ఎస్సీ, ఎస్టీలకు మద్యం షాపులను కేటాయించిన నిర్వహణకు వచ్చే సరికి సిండికేట్ చేతికి చిక్కాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మద్యం షాపులు దక్కని వ్యాపారులు ఒక్కో లైసెన్స్ లను కోటికి పైగా వెచ్చించి కొనుగోలు చేయడం విశేషం

  • మెడికల్ షాపుల మాదిరిగానే మద్యం షాపులు..?

నూతన మద్యం పాలసీ ప్రకారం లైసెన్స్ ల కేటాయింపులో ప్రభుత్వానికి ఉహించిన దానికంటే అత్యల్పంగా 130 కోట్ల వరకే ఆదాయం వచ్చింది. 2025-27 మద్యం పాలసీ ప్రకారం లైసెన్స్ దక్కించుకున్న వారు నవంబర్ 29,30 నాడు  32 కోట్ల మద్యంను ఐఎంఎఫ్ఎల్ డిపో నుంచి కొనుగోలు చేశారు. అయితే మద్యం వ్యాపారులకు లక్కీ డ్రాలో లైసెన్స్ లు దక్కినప్పటికి తాము అశించినవి దక్కకపోవడంతో వాటిని బహిరంగంగా మార్కెట్ లో కొనుగోలు చేసేశారు. కాని వాటి నిర్వహణ విషయం తెలిసిన ఎక్సైజ్ అధికారుల ప్రసన్నానికి వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాల్సి వచ్చింది. మద్యం లైసెన్స్ లు దక్కించుకున్న వారు లిక్కర్ షాపుల నిర్వహణకు తీసుకోవాల్సిన నౌకరి నామాలకు లకారాలను ఇచ్చుకున్నారు. మద్యం  లైసెన్స్ లు దక్కిన వారి చెక్కులను, ప్రామీసరీ నోట్లను ఉంచుకోని వ్యాపారానికి వారి పేర్లమీదా దందాకు తెరలేపారు. ఈ తతంగంకు అబ్కారి శాఖాధికారులు, సిండికేట్ వ్యాపారులు ములఖాత్ కావడంతో సాధ్యమైంది. ప్రధానంగా అడ్డాలను అడ్డగా పెట్టుకుని నయానో , భయానో బెదిరించి షాపులను దక్కించుకున్నారు. మెడికల్ షాపుల నిర్వహణ పార్మసీ సర్టిఫికేట్ కలిగిన వారిని భాగస్వాములుగా చదువనివారు( సర్టిఫికేట్) లేని వారు ఏర్పాటు చేయడం సహజం. అక్కడ ఎవిధంగా డ్రగ్స్ ఇన్స్ పెక్టర్ ల తనిఖీలలో తప్పంచుకుంటారో తెలిసిందే. ఇప్పుడు మద్యం దుకాణాలను దక్కించుకున్న వారి పేరు మీదా ఉండే  నౌకరి నామా కలిగిన వారితో భాగస్వామ్యం కలిగి ఉన్నట్టు రికార్డులతో లిక్కర్ దందాకు తెరలేపారు. అక్కడ డ్రగ్ ఇన్స్ పెక్టర్ లు మెడికల్ షాపుల నిర్వహకులను చూసి చూడనట్లే . . . ఇక్కడ మద్యం వ్యాపారుల దందాను లిగలైజ్ అని ఎక్సైజ్ అధికారులు లైట్ తీసుకోనున్నారు.

  • కొత్తగా బెల్ట్ షాపులు.. కొత్తవారికి పర్మిట్ రూంలు..?

నిజామాబాద్ జిల్లాలో మద్యం వ్యాపారం కోత్త పాలసీ ప్రకారం సోమవారం షూరు కానుంది. అయితే గ్రామాలలో, పట్టణాలలో, నగరంలోని బెల్ట్ షాపులలో అమ్మకాలకు వేలం వేర్రిగా కోనుగోళ్లు జరుగుతున్నాయి. లోకల్ బాడి ఎన్నికల వేళ ఇప్పటికే పంచాయతీ నగర మొగిన విషయం విదితమే. పంచాయతీ ఎన్నికలకు పంపకానికి లిక్కర్ అవసరం ఉండటంతో గ్రామాలలో బెల్ట్ షాపులకు భలే డిమాండ్ ఏర్పడింది. మద్యం వ్యాపారులు పాతవారే లైసెన్స్ లను కొన్నప్పటికి కొత్తవారికి షాపులు దక్కాయని బెల్ట్ షాపుల నిర్వాహకుల నుంచి ఎక్కువ మొత్తం డిమాండ్ చేసి దండుకుంటున్నారు. ఇక పర్మీట్ రూం లలో ప్రధానంగా నగరంతో పాటు పట్టణాలలో దక్కించుకునేందుకు జోరుగా పైరవీలు జరగుతున్నాయి. మద్యం వ్యాపారులు పర్మీట్ రూంకు చెల్లించాల్సిన ఐదు లక్షలకు తోడుగా గుడ్ విల్ చేల్లిస్తేనే పర్మీట్ రూం ల కేటాయింపు అని  డిమాండ్ తో అమ్మకాలు జరిపారు. సోమవారం నుంచి మద్యంషాపులతో పాటు బెల్ట్ షాపులు, పర్మీట్ రూంలలో కోత్త వారు అమ్మకాలు జరుపుతారా లేక పాతవారే అనేది తెలిపోనుంది. అటు ఇటు కాదంటే అబ్కారి శాఖాధికారులను పంపి బెల్ట్ షాఫులను సీజ్ చేయడం రివాజు ఉండనే ఉంది.

More articles

Latest article