24 C
Hyderabad
Sunday, August 2, 2026

పాము కాటుకు గురైన యువకుడిని కాపాడిన 108 సిబ్బంది

Must read

📰 Generate e-Paper Clip

 

 గాంధారి, బతుకమ్మ:

పాము కాటుకు గురైన యువకుడికి గ్రామంలో నాటు వైద్యంతో ప్రాణం పోయే పరిస్థితుల్లో అత్యవసర వైద్యం చేసి హూటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు 108 సిబ్బంది. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. అంబులెన్స్ సిబ్బంది కథనం ప్రకారం…గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన నందు (22)గాంధారి లో పెండ్లి కి వెళ్లాడు. అక్కడ నందు వాష్ రూమ్ కు వెళ్లే క్రమంలో పాము కాటు వేసింది . పాముకాటు వేయగానే బంధు మిత్రులు వెంటనే నందును పేట్ సంఘం గ్రామంలో సంగమేశ్వర టెంపుల్ కి నాటు వైద్యం కోసం తీసుకెళ్లడం జరిగింది, నాటు వైద్యం తర్వాత నందు పరిస్థితి విషమించడంతో 108 అంబులెన్స్ కు కాల్ చేశారు అక్కడ ఉన్న పంతులు. 108 కి సమాచారం అందగానే పేట్ సంఘం గ్రామానికి చేరుకున్న అంబులెన్స్  ఎమర్జెన్సీ మెనేజ్ మెంట్ టెక్నీషియన్ (ఈఎంటి) రమేష్, పైలట్ నరేష్ లు ముందుగా నంధుకు ప్రాథమిక వైద్యం చేశారు. పెట్ సంఘం నుంచి నందును అంబులెన్స్ లో ఏరియా హాస్పిటల్ బాన్సువాడ కి తరలించగా అక్కడ ఉన్న డాక్టర్ శ్రీను నాయక్ ట్రీట్మెంట్ అందించి నందును కాపాడారు. నంధుకు ప్రాథమికంగా వైద్యం చేసి హుటాహుటిన బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించిన ఈ ఎం టీ రమేష్ పైలట్ నరేష్ లకు ధన్యవాదాలు తెలిపారు నందు కుటుంబ సభ్యులు . అతి  తొందరలో హాస్పిటల్ కి తీసుకు వచ్చి పాము కాటుకు గురైన యువకుడి ప్రాణాలు కాపాడరని  అంబులెన్స్ సిబ్బందిని డాక్టర్ శ్రీను నాయక్ అభినందించారు.

More articles

Latest article