25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బీజేపీలో భారీగా చేరిన ఎల్లారెడ్డిపేట మండల యువకులు

Must read

📰 Generate e-Paper Clip

  • పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు గోపి

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి.. తాజాగా ఎల్లారెడ్డిపేట మండలంలో పలు గ్రామాలకు చెందిన యువకులు భారీ సంఖ్యలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి ల ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు.ఎల్లారెడ్డిపేట గ్రామం నుండి నేవూరి శ్రీనివాస్ రెడ్డి, అల్లం నవీన్ లింబాద్రి, గోలిపెల్లి ప్రవీణ్ రెడ్డి, చందనం రామకృష్ణ,పెద్దవేణి వెంకటి యాదవ్, పలువురు యువకులు బుగ్గ రాజేశ్వర తండా గ్రామానికి చెందిన భాను, శ్రీధర్, అరవింద్,రాజేష్,భూక్య మహేష్, బానోతు లక్ష్మి లతో పాటు సుమారు 100  యువకులు బిజెపి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితులై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై  పార్టీలో చేరినట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కాషాయ జెండా ఎగరవేయడానికి  కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు గంటా బాలకిషన్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు నంది నరేష్, దాసరి గణేష్,చందుపట్ల రాజిరెడ్డి, రవీందర్ నాయక్, కృష్ణ హరి, కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article