26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దుకు ఏపి ఉన్నత విద్యా మండలి సిఫార్సు

Must read

📰 Generate e-Paper Clip

ఏపీ, బతుకమ్మ : మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దుకు ఏపి ఉన్నత విద్యా మండలి సిఫార్సు ప్రభుత్వానికి చేసింది. మూడేళ్లుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి రూ.26 కోట్ల అదనంగా వసూలు చేశారని ఆరోపణలు చేసింది.  విచారణలో అధిక ఫీజుల అక్రమ వసూళ్ళు నిజమేనని ఉన్నత విద్యా మండలి నిగ్గు తేల్చి రూ.15 లక్షల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్లను 15 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును  రద్దు చేయాలని ఏపి ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి సిఫార్సు చేయనుందని సమాచారం.

More articles

Latest article