28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

తల గాయాన్ని జయించిన యువకుడు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . యశోద ఆసుపత్రి వైద్యుల అద్భుత చికిత్సతో ప్రాణాపాయం నుంచి కోలుకున్న ప్రశాంత్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

యశోద హాస్పిటల్స్ లో వైద్యులు అరుదైన, అత్యంత ప్రమాదకరమైన తలకు సంబంధించిన గాయంతో బాధపడుతున్న ఒక రోగిని విజయవంతంగా చికిత్స చేసి ఆరోగ్యవంతునిగా మార్చిన ఘటన వైద్య రంగంలో విశేష చర్చనీయాంశంగా మారింది. యశోద ఆసుపత్రి సీనియర్ న్యూరో వైద్య నిపుణుడు డా. కె. ఎస్. కిరణ్ వివరాల ప్రకారం, ప్రశాంత్ (37) అనే వ్యక్తికి జరిగిన ప్రమాదంలో తీవ్రమైన మెదడు గాయం ఏర్పడింది. ఈ గాయాన్ని వైద్యులు “డిఫ్యూస్ ఆక్సోనల్ ఇంజరీ”గా గుర్తించారు. సాధారణంగా ఇటువంటి గాయాలు అత్యంత క్లిష్టమైనవి కాగా, నరాలు దెబ్బతినడం వల్ల రోగి కోలుకోవడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. డా.కిరణ్ మాట్లాడుతూ, “తలకు వచ్చే గాయాలను మూడు గ్రేడ్‌లుగా విభజిస్తారని, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ప్రశాంత్‌ది అత్యంత ప్రమాదకరమైన స్థాయి గాయం. రోగి పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని చెప్పారు. రోగి సుమారు 13 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ సమయంలో వైద్యులు అత్యాధునిక పరికరాలను వినియోగించి చికిత్స అందించారు. ట్రాన్స్ క్రేనియల్ డాప్లర్ సాయంతో మెదడులో రక్తప్రసరణను నిరంతరం పర్యవేక్షించారు. అలాగే “ఐసిపి మానిటరింగ్” పద్ధతిలో మెదడులో ఒత్తిడిని తెలుసుకునేందుకు ప్రత్యేక వైర్ పరికరాన్ని అనుసంధానించి, వచ్చిన రీడింగ్స్ ఆధారంగా మందుల మోతాదులను సరిచేస్తూ చికిత్స కొనసాగించారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, సమయోచిత చికిత్స ఫలితంగా ప్రశాంత్ పూర్తిగా కోలుకుని ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నాడు. కోలుకున్న అనంతరం ఆయన డాక్టర్ కిరణ్ పక్కన కూర్చుని విలేకరులతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. “తలకు సంబంధించిన గాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న గాయంలా కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం ప్రాణాలను కాపాడుతుందని హెచ్చరించారు.

More articles

Latest article