28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మానవాళి మేధస్సుకు మంచి యోగ గుంజిళ్ళు

Must read

📰 Generate e-Paper Clip

  • అంతర్జాతీయ గుంజిళ్ళ ప్రచారకులు అందె జీవన్ రావు

 

నిర్మల్, బతుకమ్మ : గతంలో విద్యార్ధి దశలో తప్పు చేసిన విద్యార్థులతో ఉపాధ్యాయులు శిక్షగా తీయించెటటువంటి గుంజిళ్ళు (పస్కీలు) మానవళి మేధాస్సుకు మంచి యోగా అన్ని అంతర్జాతీయ గుంజిళ్ళ ప్రచారకులు అందె జీవన్ రావు అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రం లోని వాసవి విద్యా విహార్ లోగుంజిళ్ళు,  “సూపర్ బ్రెయిన్ యోగా” అనే అంశంపై ఆయన వర్క్ షాప్ నిర్వహించారు.  వర్క్ షాపులో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ గుంజిళ్ళు అనేవి సూపర్ బ్రెయిన్ యోగ”  అని, గుంజిళ్ళు తీయ్యడం మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయంగా ఈ గుంజిళ్ళ సాధన మన దేశంలో గl తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్దతి పాఠశాలలో కనుమరుగైందని అన్నారు.  సూపర్ బ్రెయిన్ యోగ అనేది గుంజీళ్ళ మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగ చేయడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయన్నారు. ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారాఆయన విద్యార్థులకు వివరించారు.  సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ద, సమస్యా పరిష్కారం, అభ్యసనం, గుర్తుంచుకోవడం, సృజనాత్మకత, మానసిక పెరుగుదల, మానసిక సమతుల్యత మొదలైనవి పెంపొంది సమస్యలు, ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందన్నారు. యోగ ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో సూపర్ బ్రెయిన్ యోగా వలన విద్యార్థులకు  మేలు జరుగుతుందని అన్నారు. కావున గుంజీళ్లు తీయడాన్ని శిక్షగా కాకుండా శిక్షణగా పరిగణించాలని అన్నారు. బహుళ ప్రయోజనాలు ఉన్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాలలో శిక్షణలో భాగంగానే పరిగణించి అమలు చేయడం ద్వారా విద్యార్థి లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చునని ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులచే  14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా (గుంజిళ్ళ)ను ఆయన చేయించారు. తాను జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో సమర్పించిన పరిశోధన పత్రాల ప్రతులను పాఠశాల కరస్పాండెట్లు  పోతా రెడ్డి, మోహన్ రెడ్డి  లకు ఆందజేశారు.  ఈ కార్యక్రమంలో వేల్పుల రాయ్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అందె జీవన్ రావు ను శాలువాతో ఘనంగా సన్మానించారు.

Yoga poses that are good for human intelligence

More articles

Latest article