నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో బుధవారం అతిథి ఉపన్యాసం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషలో ఎంతో సాహిత్యం ఉందన్నారు. ఎందరో కవులు కృషి చేసి తమ ప్రతిభ చేత ఎంతో గుర్తింపు పొందుతున్నారని, ఆవిధంగా విద్యార్థులు మీ సామర్థ్యాలు మెరుగు దిద్దుకోవాలని అన్నారు. కార్యక్రమ ముఖ్యవక్త డా. పద్మారాణి “వచన కవిత్వం – లఘు కవితా రూపాలు” అనే అంశంపై విస్తృతోపన్యాసం చేశారు. వచన కవిత్వంలో వచ్చిన మినీకవిత, నానీలు, హైకూలు, రుబాయిలు, రెక్కలు వంటి లఘుకవితా రూపాలకు సంబంధించిన విశిష్టతలను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కవిత్వంలోని మౌలికమైన అంశాలు, లక్షణాలు,ఉదహరిస్తూ విద్యార్థులకు చక్కటి అవగాహనను కలిగించారు. తెలుగు విభాగాధిపతి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి తెలుగులో వచన కవిత్వ నేపథ్యం, లఘు కవిత రూపాలు ఏర్పడడానికి గల కారణాలను విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, కామర్స్, బి.బి.ఏ. విభాగం అధిపతులు వినాయకుమార్, డాక్టర్ రంజిత, పీఆర్.ఓ. డాక్టర్ దండుస్వామి, ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, అదనపు అకాడమిక్ కోఆర్డినేటర్లు నహేద బేగం,రాహుల్, కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ శమంత, తెలుగు అధ్యాపకులు కె.గంగాధర్, డాక్టర్ శ్రీనివాస్, ఆర్.రాజేశ్వర్, రాధిక, అర్చన, రజిత, సుమన్, శ్రీనివాస్, సంతోష్ కుమార్ గౌడ్, సతీష్, తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
