జిజి కళాశాలలో “వచన కవిత్వం – లఘు కవితా రూపాలు”
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో బుధవారం అతిథి ఉపన్యాసం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషలో ఎంతో సాహిత్యం ఉందన్నారు. ఎందరో కవులు కృషి చేసి తమ ప్రతిభ చేత ఎంతో గుర్తింపు పొందుతున్నారని, ఆవిధంగా విద్యార్థులు మీ సామర్థ్యాలు మెరుగు దిద్దుకోవాలని అన్నారు. కార్యక్రమ ముఖ్యవక్త డా. పద్మారాణి "వచన కవిత్వం - లఘు కవితా రూపాలు" అనే అంశంపై విస్తృతోపన్యాసం చేశారు. వచన కవిత్వంలో...