రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ద్వాదశి సందర్భంగా ఆదివారం ఉదయం స్వామివారికి కాకడ హారతి, అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారికి లక్ష తులసి దళాలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రణవానంద స్వామి హాజరై భక్తులకు ప్రవచనాలు ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని, భక్తితోనే ముక్తి లభిస్తుందని సూచించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, ఆలయ కమిటీ నిర్వాహకులు చిదుర వీరేశం, గెంటిల సాయిలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
