లక్ష తులసి దళాలతో విఠలేశ్వర స్వామికి అర్చన

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ద్వాదశి సందర్భంగా ఆదివారం ఉదయం స్వామివారికి కాకడ హారతి, అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారికి లక్ష తులసి దళాలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రణవానంద స్వామి హాజరై భక్తులకు ప్రవచనాలు ప్రసంగించారు.  ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని, భక్తితోనే ముక్తి లభిస్తుందని సూచించారు.  అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, ఆలయ కమిటీ...