హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని మంగళవారం జూబ్లీహిల్స్ లోని తన క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఒలంపిక్ సంఘం కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్చాన్నందించి శాలువాతో ఒలంపిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. సీఎంను కలిసిన వారిలో నిజామాబాద్ జిల్లా నుండి ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులనా ఈగ సంజీవరెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర ఒలింపిక్ ఈ సి సభ్యులు నంద్యాల లింగన్న ఉన్నారు. ఈ సన్మాన కార్యక్రమం లో తెలంగాణ ఒలంపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి, మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కేంద్ర మంత్రి వేణు గోపాల చారీ, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్షులు, కోశాధికారి, మెంబర్లు పాల్గొన్నారు.
