సీఎంను కలిసిన తెలంగాణ ఒలంపిక్ సంఘం కార్యవర్గం
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని మంగళవారం జూబ్లీహిల్స్ లోని తన క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఒలంపిక్ సంఘం కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్చాన్నందించి శాలువాతో ఒలంపిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. సీఎంను కలిసిన వారిలో నిజామాబాద్ జిల్లా నుండి ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులనా ఈగ సంజీవరెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర ఒలింపిక్ ఈ సి సభ్యులు నంద్యాల లింగన్న ఉన్నారు....