బతుకమ్మ, బిచ్కుంద : లగచర్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుండి కాపాడాలని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున రాజ్యాంగాన్ని కాలరాస్తుందని దళిత గిరిజనులు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్ర అనచిచేవేతకు గురవుతున్నారని ఆయన అన్నారు. దళిత గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డుపైన పడేసే కుట్ర చేస్తుంది అని కాంగ్రెస్ రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగడుగున వ్యవహరిస్తున్న తీరుకు ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం లగచర్లలో పేద రైతన్నల భూములు లాక్కొని ఒకసారి ఫార్మా విలేజ్, అని మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని మాయమాటలు చెబుతూ రైతన్నల భూములను ఆదానికి, తన అల్లుడికి అప్పజెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తమ భూములు తమకు ఇవ్వమని జీవనాధారాన్ని లాక్కోవద్దని ప్రభుత్వానికి పది నెలలుగా విజ్ఞప్తిచేస్తున్న , పట్టించుకోకుండా ,నిరంకుశంగా, పాషవికంగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఖండిస్తున్నామని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గం పేద బడుగు బలహీన దళిత గిరిజన రైతుల పైన చేస్తున్న అరాచకాలను అణిచివేతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు పోలీసులు చేసిన థర్డ్ డిగ్రీ టార్చర్ మీ దృష్టికి తీసుకు వస్తున్నాము అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా రైతన్నల జైల్లో పెట్టి చేతులకు బేడీలు వేసిన రాజ్యాంగ వ్యతిరేక చర్యలను పోలీసుల అణిచివేతను వేధింపుల నుండి వారిని కాపాడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. రైతన్నల పై పెట్టిన కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని వారి కుటుంబాలను వేధించడం హింసించడం ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి సద్బుద్ధి, జ్ఞానోదయం కలిగించాలని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు వినతి పత్రంలో పేర్కొంటూ ఆయన సమర్పించారు. ఈ కార్యక్రమంలో బారాస పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరావు దేశాయ్, మండల కార్యదర్శి రాంచందర్ మాజీ జెడ్పిటిసి నల్చర్ రాజు, డాక్టర్ రాజు, మిషన్ కల్లాలి సర్పంచ్ సంజువ్ మైపతి హనుమాన్లు సెట్ తదితరులు పాల్గొన్నారు.
