29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఏఐటియూసీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : మెడికల్ కళాశాల, నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని గురువారం ప్రభుత్వ ఆసుపత్రి నిజామాబాద్ లో  తెలంగాణ రాష్ట్ర డిఎంఈ నరేంద్ర కుమార్ ని కలిసి ఏఐటియూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య, జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని 1000 పడకలకు పెంచి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరమన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ప్రతిరోజు నిజామాబాద్, అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు రోజుకు సుమారు 2,500 మంది అవుట్ పేషన్స్ ఓపీ,  1200 మంది ఇన్  పేషంట్స్ లకు పైగా చికిత్సకోసంరోగులు వస్తున్నారని కావున నిజామాబాద్ ఆసుపత్రిని 1000 పడకలను పెంచి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వారిపై పనిభారం, పెరుగుతున్నందున రెగ్యూలక్ సిబ్బందితో పాటు శానిటేషన్, పేషంట్ కేర్ సెక్యురిటీని పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు. మెడికల్ కళాశాలలో గత టెండర్ కంటే బడ్జెట్ను తగ్గించి  టెండర్ వేయడం వల్ల కార్మికులపై పని భారం పెరుగుతున్నదని బడ్జెట్ను పెంచి కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. డీఎంఈ స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. డిఎంఈ ని కలిసిన వారిలో యూనియన్ నాయకులు భాగ్యలక్ష్మి, హైమది, స్వరూప, వెంకటేష్ పాల్గొన్నారు.

Workers' problems must be resolved: AITUC

More articles

Latest article