29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయాలి

Must read

📰 Generate e-Paper Clip

జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ ఆదేశించారు. జిల్లాలోని డిచ్పల్లి ప్రభుత్వ కళాశాల, దర్మారంలోని సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమయపాలన ను పర్యవేక్షించారు. అలాగే అధ్యాపకుల   విద్యా బోధనను తరగతి గదులలో స్వయంగా  తనిఖీ  చేసి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా అధికారి  ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బందితో సమావేశమయ్యారు. సమయ పాలన పాటిస్తున్న సిబ్బంది ని  ఈ సందర్భంగా  ఇంటర్ విద్యా అధికారి   అభినందించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ 2024 – 25 విద్యా సంవత్సరం  వార్షిక పరీక్షలకు అధ్యాపకులు  ప్రణాళిక బద్ధంగా బోధన చేసి  మంచి ఫలితాలను సాధించాలని  ఆదేశించారు. ఇంటర్ ప్రయోగ పరీక్షలకు విద్యార్థులను  సిద్ధం చేయడంతో పాటు  విద్యను అభ్యాసించడంలో వెనుకబడిన బడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వారు కూడా ఉత్తీర్ణులు  అయ్యేందుకు  ప్రణాళికతో ముందుకు వెళ్లాలని   ఆదేశించారు. పేద, బడుగు బలహీన, మైనారిటీ, విద్యార్థులు అభ్యసిస్తున్నారని, మంచి విద్యా బోధన జరగాలని ఆదేశించారు.  కళాశాలలో గ్రంధాలయం,  సైన్స్ ప్రయోగశాలలు నిర్వహణ కోసం నిధులు సమకూర్చడం జరుగుతుందని అన్నారు.  కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, మత్తు పదార్థాల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు.  కళాశాలకు సమయపాలన పాటించడంతోపాటు ఆలస్యంగా వచ్చిన అధ్యాపకులు, సిబ్బంది పై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మావేశంలో  ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Work responsibly in the performance of duties

More articles

Latest article