23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

పీసీసీ మహేష్ గౌడ్‌ను కలిసిన నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ : ఆయిలాపూర్ సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్, తొండకూర్ దశగౌడ్ గ్రామాల  అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ శనివారం హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌ను కలిశారు. ఈ సమావేశంలో వారు తమ గ్రామాల కోసం పలు అభివృద్ధి పనుల అమలుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు.  ఈ అభ్యర్థనను పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంటున్నారని తెలిపారు. సీనియర్   నాయకులను  అభినందిస్తూ గ్రామ  ప్రజల అభివృద్ధి  కార్యక్రమాల కొరకు  కృషి చేయాలని చెప్పారు. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాకీర్ హుస్సేన్, బట్టు సాయిరాం తదితరులు ఉన్నారు.

More articles

Latest article