విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయాలి
జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ ఆదేశించారు. జిల్లాలోని డిచ్పల్లి ప్రభుత్వ కళాశాల, దర్మారంలోని సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమయపాలన ను పర్యవేక్షించారు. అలాగే అధ్యాపకుల విద్యా బోధనను తరగతి గదులలో స్వయంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా అధికారి ...