29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

సమాజ అభివృద్ధికి మహిళల అక్షరాస్యత ఎంతో అవసరం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మున్సిపల్ మేనేజర్ వసతి

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

సమాజ అభివృద్ధికి మహిళల అక్షరాస్యత ఎంతో అవసరమని మున్సిపల్ మేనేజర్ వసతి అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో “అమ్మకు అక్షర మాల” కార్యక్రమం భాగంగా అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ మేనేజర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి మహిళకు అక్షర జ్ఞానం ఉండేలా ప్రభుత్వం ప్రత్యేకంగా “అమ్మకు అక్షరాభ్యాసం” కార్యక్రమాన్ని అమలు చేస్తోందని వివరించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అక్షరాస్యత ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మహిళలు చదువు నేర్చుకుంటే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వ పథకాలను సులభంగా వినియోగించుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.దుర్గ, డి.శోభ రాణి పాల్గొని మహిళలకు అక్షరాస్యతపై ప్రేరణాత్మకంగా అవగాహన కల్పించారు. అలాగే ఎఎల్ఎఫ్ (అడల్ట్ లిటరసి ఫెసిలిటేటర్), ఓబి (ఆర్గనైజింగ్ బాడిస్), ఆర్ పి (రిసౌర్స్ పర్సన్స్) లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సదస్సులో పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొని అక్షరాస్యతపై ఆసక్తి వ్యక్తం చేశారు.

 

Women's literacy is essential for the development of society.

More articles

Latest article