స్నేహ సొసైటీలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

0 9,380

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతినగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్, సఖి వన్ స్టాప్ సెంటర్ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, ప్రముఖ సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ ప్రతిమా రాజ్, విజయలక్ష్మి హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ డా.బండారి సుజాత, నిజామాబాద్ అర్బన్ సిడిపిఓ సౌందర్య తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక గొప్ప ఆశయంతో ఏర్పాటు చేసి ఎంతోమంది దివ్యాంగ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతిదని అభినందించారు. మామూలు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు దీటుగా స్నేహ సొసైటీ పాఠశాల దివ్యాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో సకలాంగులకు దీటుగా ముందుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. స్నేహ సొసైటీ అభ్యున్నతికి తమ వంతు బాధ్యతగా సహకారం అందజేస్తానని నిజామాబాద్ మేయర్ హామీ ఇచ్చారు. అనంతరం సీనియర్ వైద్యులు డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ ప్రతి ఆడపిల్ల ఒక లక్ష్యంతో కష్టపడి జీవితంలో వస్తున్న ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడి ముందుకు సాగినప్పుడే ఉన్నత స్థాయిలో రాణిస్తారని తెలిపారు. మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఘనత దివ్యాంగ మహిళకే దక్కిందని అలాగే ఎంతోమంది మహిళలు కష్టపడి చదువుకొని దేశస్థాయిలో టాపర్లు గా నిలిచిన ఘనత మహిళల్లో ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓపికతో చదువుకొని ఉన్నత స్థాయిలో రాణించాలని తెలియజేశారు. అనంతరం  ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బండారి సుజాత, అర్బన్ సిడిపిఓ సౌందర్య మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో నిలదొక్కుకోవడానికి చదువు చాలా ముఖ్యమన్నారు. ప్రస్తుతం ఆడ మగ అని తేడా లేకుండా విద్యా, వైద్యం, వ్యాపారం ప్రతి రంగంలో కూడా మహిళలు రాణిస్తున్నారని తెలియజేశారు. ఒక మహిళ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధులైన బైసా సంగీత , వీరనేని రమాదేవి , బొడ్డు లక్ష్మీదేవి, అంధుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ .జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలల ప్రిన్సిపల్ రాజేశ్వరి లను శాలువలు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లత, తీరునగరి విరజ, సుధా వేరోనిక, ఏ. రాజ్యలక్ష్మి, డి.సునీత లను సన్మానించారు.

 

Women's Day celebrations at Sneha Society

Leave A Reply

Your email address will not be published.