నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో మహిళా దినోత్సవ వేడుకలను పార్టీ నగర మహిళా విభాగం అధ్యక్షురాలు రేవతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ప్రతిరంగంలో ముందుకు వెళ్తున్నారని, మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన స్వేచ్ఛ, ప్రాధాన్యత కారణంగానే ఈరోజు మహిళలకు గుర్తింపు లభించిందన్నారు. ప్రతి రంగంలో మహిళలకు స్థానం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తమ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, ఆశాబీ,గాజుల సుజాత,మలైకా బేగం,విజయ రాణి,అపర్ణ,మీనా తదితరులు పాల్గొన్నారు.
