24.7 C
Hyderabad
Monday, August 3, 2026

కల్లుబట్టిలో మాటలు కలిపిన మహిళలు

Must read

📰 Generate e-Paper Clip

  • బైక్ పై లిఫ్ట్ అడిగి మాయ చేసిండ్రు
  • భార్యతో సంబంధం ఏమిటి అని వ్యక్తి వద్ద 28,000 లాక్కున్న పురుషులు

 

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కల్లుబట్టిలో ఓ వ్యక్తికి తారసపడిన ఇద్దరు మహిళలు అతన్ని మాటలతో మాయ చేసి బురిడీ కొట్టించారు. తాను వెళ్లే దారిలో వెళ్తున్నామని తమకు లిఫ్ట్ కావాలని బైక్ ఎక్కి కొంత దూరం ప్రయాణించారు.  మార్గమధ్యలో మహిళల భర్తని చెప్పుకున్న వ్యక్తి అడ్డుపడి తన భార్యతో నీకేంటి సంబంధమని బైక్పై ఉన్న వ్యక్తిని బెదిరించి 28 వేల రూపాయలను లాక్కున్నారు. ఈ సంఘటన ఈనెల 18న కామారెడ్డి పట్టణంలో జరిగింది. కామారెడ్డి పట్టణ సిఐ నరహరి కథనం ప్రకారం… శుక్రవారం మధ్యాహ్నం చింతమానుపల్లి గ్రామస్థుడు అయిన చిన్న గంగయ్య అనే వ్యక్తి కామారెడ్డి లోని దుబ్బ గౌడ్ కల్లు దుకాణంలోకి వెళ్ళాడు. అక్కడ ఇద్దరూ ఆడ మనుషులు అతనితో మాటలు కలిపి,  ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగా, చిన్న గంగయ్య నేను చింతమానుపల్లికి వెళ్తున్నానని చెప్పడు. అందులో నుండి ఒక మహిళ మీరు వెళ్లే దారిలో నన్ను దింపేయమని అడిగింది. దానితో చిన్న గంగయ్య ఆమెను తన యొక్క బండిపై ఎక్కించుకొని వెళ్తుండగా, మార్గమధ్యలో హరిజనవాడ కళ్ళు దుకాణంలో అతను కళ్ళు తాగుతానని చెప్పగా, అందుకు ఆమె సరే అని చెప్పినది. అతడు కల్లు తాగి వచ్చిన తర్వాత ఇద్దరు బండిపై కొద్ది దూరం వెళ్ళినాక, ఆమె బండి ఆపమని అతనిని కోరింది. బండి ఆపిన కొద్ది నిమిషాలలోనే ఇద్దరు మగ వ్యక్తులు అక్కడికి వచ్చి నా భార్య ని బండిపై ఎందుకు ఎక్కినది అని ప్రశ్నించి, నీకు నా భార్యకు సంబంధం ఏమి ఉందని బెదిరించారు. తన జేబులో ఉన్నటువంటి 28 వేల రూపాయలను, పర్స్ ను గుర్తు తెలియని వ్యక్తులు లాక్కొని వెళ్ళినారని ఫిర్యాదు రాగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More articles

Latest article