. . . న్యాయ వాద పరిషత్ అధ్యక్షులు ఎం.జగన్ మోహన్ గౌడ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
భారత దేశ చరిత్రలో మహిళకు ప్రత్యేక స్థానం ఉందని న్యాయవాద పరిషత్ అధ్యక్షులు ఎం జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. సోమవారం నగరం లోని స్థానిక ఉషోదయ డిగ్రీ కళాశాలలో న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాచీన భారతదేశ నాగరికతలో స్త్రీని ఒక గొప్ప వ్యక్తిగా అభివర్ణించడం జరిగిందని, దేశ స్వతంత్ర ఉద్యమంలో ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్య దేవి లాంటివారు వీరోచితం గా పోరాటం చేసి మనందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని, మహిళ అభివృద్ధి చెందితే ఆ ఇల్లు తో పాటు ఆ గ్రామం ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గత సంవత్సరం దేశంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా ఇద్దరు మహిళల అధికారులు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మట్టి కరిపించి భారత మహిళా శక్తిని చాటారని తెలిపారు. విద్యార్థినిలు అందరు కూడా చరిత్ర ఆధారంగా నడవాలని, దేశ సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టాలని పాశ్చాత్య సంస్కృతి పోకడలను వీడనాడాలని, భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఇంకా ముందుగా ఎదగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పిల్లి శ్రీకాంత్, సింగం అంజలి, కళాశాల కరస్పాండెంట్ దేవా రెడ్డి, ప్రిన్సిపాల్ స్వప్న తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.
