27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళకు 10నెలల జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రెషర్ కుక్కర్ విషయంలో గొడవపడి ఒక మహిళను గాయపరచిన ఎర్నాల సావిత్రి కి పది నెలల మూడు రోజుల జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి భరత లక్ష్మి గురువారం తీర్పు చెప్పారు. కోర్టు వెలువరించిన పదిహేడు పేజీల తీర్పులో….నిజామాబాద్ రూరల్ మండలం జాలాల్ పూర్ గ్రామానికి చెందిన ఘనశెట్టి గంగవ్వ దగ్గర అదే గ్రామానికి చెందిన ఎర్నాల సావిత్రి ప్రెషర్ కుక్కర్ రెండు వేల రూపాయలకు కొన్నది. అది పనికి రాకుండా పోయింది. ఈ విషయం గంగవ్వ కు తెలియజేయడంతో ఆమె బాగుచేసిస్థన్నది. ఎంతకు ప్రెషర్ కుక్కర్ ను బాగుజేసి ఇవ్వకపోవడంతో 25 జులై, 2024 న గంగవ్వ ఇంటిలోకి వెళ్లి గొడవపడి కమ్మ కత్తితో గాయపర్చిన నేరారోపనలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో సావిత్రి కి 10 నెలల 3 రోజుల జైలుశిక్ష ఖరారు చేశారు. రెండు వందల రూపాయల జరిమానా కూడా విధించారు.

  • కొస మెరుపు..

9 ఆగస్టు, 2024 నుండి జ్యూడిషయల్ రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న సావిత్రి జూన్ 12 కు 10 నెలల 3 రోజులు గడిచి పోవడంతో విడుదల అవుతున్నారు. రిమాండ్ కాలాన్నే నే శిక్ష కాలంగా కోర్టు పరిగణించింది.

More articles

Latest article