26.3 C
Hyderabad

ఆపరేషన్​ సిందూర్​’లో పాల్గొన్న జవాన్​కు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని కన్నారెడ్డి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మర్కంటి ప్రశాంత్ ను గురువారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ ఆపరేషన్​ సిందూర్​లో పాల్గొని శత్రు సైన్యాన్ని మట్టుబెట్టి, భారతదేశానికి విజయాన్ని అందించడంలో తన వంతు కీలకపాత్ర పోషించిన ఆయన ధైర్యసాహసాలను కొనియాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో దేశం మొత్తం భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాల్ తుమ్మెద సొసైటీ చైర్మన్ దుందిగళ్ళ నర్సింలు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య, నాయకులు మురళి, రాజారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, యాదగిరి, ఎండి ఫరీద్, వంశీకృష్ణ గౌడ్, సంతోష్ గౌడ్, బాబురావు, లక్ష్మీకాంతం, శ్రీనివాస్ తదితరులున్నారు.

More articles

Latest article