29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కొడుకు ఆచూకీ చెప్పడం లేదని మహిళ హత్య

Must read

📰 Generate e-Paper Clip

. బాలుడిని హైదరాబాద్ లో కిడ్నాప్ చేసి అమ్మేసిన మృతురాలు

. వారం రోజులుగా కొడుకు ఆచూకీ కోసం బతిమాలి విసిగెత్తి హత్య

. కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిన ఘటన

గాంధారి, బతుకమ్మ: తన కొడును కిడ్నాప్ చేసి విక్రయించిన మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు.  ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మేడిపల్లి అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని అమీర్ పేట్ కు చెందిన అమీనాబేగం(35) అక్కడ ఓ బాలుడిని కిడ్నాప్ చేసి విక్రయించింది. తన కొడుకును అమీనాబేగం కిడ్నాప్ చేసిందని తెలుసుకున్న బాలుడి తండ్రి ఆమెను తన కొడుకు ఆచూకీ చెప్పాలని బతిమాలాడు. ఈ క్రమంలో ఆమె వారం రోజులపాటు బాలుడి తండ్రిని తిప్పించుకుంది. వారివురు కామారెడ్డి ప్రాంతంలో రెండు రోజులుగా ఉంటున్నారు. తన కొడుకు ఆచూకీ చెప్పాలని అమీనాబేగంను బతిమాలుతున్నా చెప్పడం లేదని ఆగ్రహానికి గురైన సదరు వ్యక్తి సోమవారం ఉదయం మేడిపల్లి అటవీప్రాంతంలో ఆగ్రహంతో విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article