29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Must read

📰 Generate e-Paper Clip

  • బంగారు ఆభరణాల కోసమే హత్య..?

 

కామారెడ్డి, బతుకమ్మ : వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన చిదుర కవిత(35) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బుధవారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన కవిత రాత్రయినా ఇంటికి రాకపోయే సరికి వెళ్లి చూడగా చెట్టుకు చీరతో ఉరేసుకున్నట్టుగా వేలాడుతున్న కవిత మృతదేహం కనిపించింది. కవిత ఒంటిపై పుస్తెల తాడు, బంగారు ఆభరణాలు, కాళ్ల కడియాలు కనిపించడం లేదని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కవిత గొంతుపై గాయం ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి ఆభరణాలు దోచుకుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More articles

Latest article