బతుకమ్మ, బాన్సువాడ : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం వర్ని మండలం అంతాపూర్ తండాలో నూతనంగా నిర్మించిన జగదంబా మాత, సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు. పౌరాదేవి పీఠాధిపతి సంత్ బాబుసింగ్ మహారాజ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడు మార్గాన్ని వీడి ఆధ్యాత్మిక మార్గంలో పయనించేలా సేవాలాల్ మహారాజ్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్, పోచారం సురేందర్ రెడ్డి, తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.
