అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
బంగారు ఆభరణాల కోసమే హత్య..? కామారెడ్డి, బతుకమ్మ : వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన చిదుర కవిత(35) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బుధవారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన కవిత రాత్రయినా ఇంటికి రాకపోయే సరికి వెళ్లి చూడగా చెట్టుకు చీరతో ఉరేసుకున్నట్టుగా వేలాడుతున్న కవిత మృతదేహం కనిపించింది. కవిత ఒంటిపై పుస్తెల...