26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పోలీస్ లకు తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళ అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ :

పోలీసులపై తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళపై కేసు నమోదు చేసినట్లు నందిపేట్ ఎస్సై శ్యామ్ రాజ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం నందిపేట గ్రామానికి చెందిన పిప్పేర అంకిత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనని కట్టేసి కొట్టారని ఇచ్చిన ఫిర్యాదు లో భాగంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, నివ్వేరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. నిజామాబాదు గంగస్థాన్ లో నివాసం ఉంటున్న ప్రతాపరెడ్డి వృత్తి రీత్యా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడని, ఎలాగైనా అతని దగ్గర నుండి డబ్బులు రాబట్టాలని ఆలోచన చేసిన పిప్పర అంకిత సింగారం, నవీన్, అంబటి శ్రీనివాస్ కలిసి, పథకం వేసి అక్టోబర్ 4న అతని పై తప్పుడు కేసు పెట్టగా ప్రతాప్ రెడ్డి దగ్గర వున్నా కాల్ రికార్డ్ తో కథ అడ్డం తిరిగిందన్నారు. తీరా ఇప్పుడు 30లక్షలు డిమాండ్ చేస్తూ అంబటి శ్రీనివాస్ పై కేసు వాపసు తీసుకోవాలి అని బెదిరించినట్లు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించిన్నట్లు ఎస్సై శ్యామ్ రాజ్ వివరించారు. పోలీస్ వ్యవస్థను తప్పు దారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

More articles

Latest article