28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పాఠశాలకు పూర్వ విద్యార్థులు వైర్ లెస్ మైక్ సెట్ వితరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల : మండల తొర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదివిన 2008-09 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు వైర్ లెస్ మైక్ సెట్ ను పాఠశాల హెచ్ఎం దశంధర్ కు బుధవారం అందజేశారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ మేము బాల్యంలో ఇదే పాఠశాలలో చదివినందుకు పాఠశాలకు తమ వంతుగా ఏదైనా  సహాయం చేయాలని ఆలోచించి, ఇట్టి సహాయాన్ని ఇవ్వాలని మేము ఆలోచించి వైర్ లెస్ మైక్ సెట్ ను పాఠశాలకు అందజేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే తాము పాఠశాలలో చదువుకున్న పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని అందరూ సంతోషపడ్డారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నవీన్,రాజ్ కుమార్ పాల్గొన్నారు.

More articles

Latest article