29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

క్రీడల్లో గెలుపోటములు సహజం

Must read

📰 Generate e-Paper Clip

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్, బతుకమ్మ : క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని క్రీడాకారులు క్రీడ స్ఫూర్తిని అలవార్చుకోవాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.మంగళవారం మండలంలోని మోతే గ్రామంలో నిర్వహిస్తున్న మండల 68 వ ఎస్ జీ ఎఫ్ మండల స్థాయి అంతర పాఠశాల క్రీడోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడాకారులకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు.
జీవితంలో ఎదురయ్యే అటుపోటులను ఎదుర్కోని నిలబడటానికి క్రీడలు మనకు మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని ఇస్తాయని, తల్లి దండ్రులు పిల్లలకు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్నారు. మండల స్థాయి క్రీడల నిర్వహణకు ముందుకు వచ్చిన మోతె గ్రామానికి, క్రీడలు ఇంత గొప్పగా నిర్వహించడానికి గ్రామం నుండి ముందుకు వచ్చిన దాతలకు,పాఠశాల యాజమాన్యానికి ,గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు,గ్రామ యువకులకు అభినందనలు తెలిపారు. మా కుంటుంబం మొత్తం క్రీడల బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినవారమేనని, ప్రస్తుతం సోషల్ మీడియా,స్మార్ట్ ఫోన్ యుగంలో క్రీడలు అంటే మక్కువ ఉన్న సురేష్, పి.ఈ టి లు అందరూ కలిసి క్రీడలు ఇంత గొప్పగా నిర్వహించడం గొప్ప పరిణామం అని అన్నారు. ఈ గ్రామం ఉద్యమ స్ఫూర్తి కలిగిన గ్రామమని, మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఈ గ్రామం ఉపిరిలూదిందన్నారు. ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని పొందేందుకు మోతే మట్టిని ముడుపు కట్టి తెలంగాణ భవన్ తీసుకెళ్లారని గుర్తు చేశారు. మళ్ళీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మోతె వచ్చి ముడుపు విప్పడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, స్కూల్ హెడ్ మాస్టర్ ,పీఆర్ టీయు నాయకులు ,ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Winning in sports is natural

More articles

Latest article