క్రీడల్లో గెలుపోటములు సహజం

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, బతుకమ్మ : క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని క్రీడాకారులు క్రీడ స్ఫూర్తిని అలవార్చుకోవాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.మంగళవారం మండలంలోని మోతే గ్రామంలో నిర్వహిస్తున్న మండల 68 వ ఎస్ జీ ఎఫ్ మండల స్థాయి అంతర పాఠశాల క్రీడోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడాకారులకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో ఎదురయ్యే అటుపోటులను ఎదుర్కోని నిలబడటానికి క్రీడలు మనకు మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని...