నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ ఎస్ఎచ్ఓ బి.రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. విజిలెన్స్ అధికారులు నగరంలోని పలు హాస్పిటళ్లను శనివారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఖలీల్ వాడీలో గల లయన్స్ కంటి ఆసుపత్రిపై విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దొడ్డి ముంగట్లి అనే ఆప్తమాలజిస్ట్ డాక్టర్ పట్టాలేకుండానే ఆసుపత్రిలో రోగులకు వైద్యాన్ని అందస్తున్నాడు. రోగులకు ఇంజక్షన్స్, ఐవీ ఫ్రూట్స్ ఎక్కిస్తున్నట్లు తనిఖీలో బయటపడింది. దీంతో దొడ్డి మంగట్టి అనే నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అదేవిధంగా బోధన్ రోడ్డు నందు ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ నడిపిస్తున్న మహ్మద్ సందని కూడా ఎటువంటీ డాక్టర్ పట్టా లేకుండా రోగులకు చికిత్స అందిస్తున్నాడు. ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు డాక్టర్లపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
