28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

స్కూల్స్  లో ఖర్చుల లెక్కలు తేలుతాయా..?

Must read

📰 Generate e-Paper Clip

  • పాఠశాలల్లో అడిట్ కు వేళయింది
  • సర్కారు బడులలో చేసిన జమా బంది లెక్కల పరిశీలనకు అడిట్ టీంలు

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 220 పైగా విద్యార్థినులు ఉండగా ఒకే ఓక్క టాయిలెట్ ఉండగా విద్యార్థినీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై  హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించిన వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపింది. సంబంధిత పాఠశాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు, గ్రాంట్ లు లక్షల రూపాయాలు కేటాయించిన అక్కడ టాయిలెట్ లు కట్టకపోవడంపై, నిర్వహణ అస్థవ్యస్థంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నిజామాబాద్ నగరంలోని బాలికల పాఠశాలలో టాయిలెట్  నిర్వహణ అధ్వాన్నంగా ఉన్న వ్యవహారం హ్యూమన్ రైట్స్ కమిషన్ తనిఖీలో వెల్లడైంది. పాఠశాల మెయింటనేన్స్ కు నిధులు వస్తున్న వాటిలో సగంకుడా ఖర్చు చేయడం లేదని ఆనాటి అధికారుల తనిఖీలలో వెల్లడైంది. సంబంధిత పాఠశాలకు కేటాయించిన నిధుల లెక్కలు అడిట్ లో బయటకు వస్తాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ధర్పల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బియ్యం మిగిల్చుకున్న వ్యవహారం హెడ్మాస్టర్ సీటుకు ఎసరు తెచ్చింది. ఎందుకంటే విద్యార్ధుల సంఖ్యకు కేటాయింపులకు సంబంధం లేకపోవడమే కారణం. సర్కారు, లోకల్ బాడి స్కూళ్లకు, ఎయిడేడ్ పాఠశాలలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మేయింటనేన్స్ నిధులను, గ్రాంట్లను కేటాయించిన చివరకు పిల్లలకు క్రీడలు ఆడించకుండానే తప్పుడు లెక్కలు రాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చివరకు చాక్ పీసు లు లేవని విద్యార్ధుల వద్ధ వసూళ్లు చేసిన ఘటనలు ఉన్నాయి.

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం సర్కారు పాఠశాలలకు ఇచ్చిన నిధులపై ఖర్చుల లెక్కలు తీసేందుకు అడిట్  టీంల పరిశీలన జిల్లాలో ప్రారంభం కానుంది. ప్రతి విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి మార్చీ 31 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు సక్రమంగా ఖర్చు చేశారా అని లోకల్ ఫండ్ అడిట్ అధికారులు తనిఖీలు చేయనున్నారు. నిజామాబాద్ జిల్లాలో 1198 సర్కారు, స్థానిక సంస్థల పాఠశాలలకు, 21 ఎయిడేడ్ పాఠశాలలకు ప్రతి ఏడాది స్కూల్ గ్రాంట్స్, మెయింటనేన్స్ గ్రాంట్స్, ఎంఆర్ సి గ్రాంట్స్, కాంప్లెక్స్ గ్రాంట్స్, పీయం శ్రీ స్కూల్ గ్రాంట్స్ నిధుల ఖర్చు లెక్కలు తేల్చే పనిలో పడ్డారు అడిట్ డిపార్ట్ మెంట్. కాని ప్రతి సంవత్సరం ఈ వ్యవహారం పార్స్ గా మారిందనే వాదనలు ఉన్నాయి. టాయిలేట్ ల మేయింటనేన్స్ చేయకున్న, చివరకు మధ్యాహ్న భోజనం గదులను శుభ్రంగా ఉంచకున్న, తరగతి గదులకు తాత్కాలికంగా మరమ్మత్తులు చేయకున్న, రంగులు వేయకున్న, తరగతి గదులలో చాక్ పీసులు కొనుగోలు చేయకున్న, స్పోర్ట్స్ ఆడించకున్న ఆడించినట్లు వస్తు సామాగ్రీ కొన్నట్టు  నకిలీ బిల్లులను రూపొందించి తప్పుడు లెక్కలను రైట్ గా మారుస్తారు అనే ఆరోపణలు ఉన్నాయి.

అడిట్  అధికారులు రాక ముందే క్యాష్ బుక్ లు ఎలా రాయాలి అనే అంశంలో ఆరి తేరిన హెడ్మాస్టర్ లు తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్ధ హస్తులు అని చెప్పాలి. ఓపెనింగ్ బ్యాలేన్స్, క్లోజింగ్ బ్యాలేన్స్ లను పక్కాగా పాటించి ఓచర్లను మేయింటనేన్స్ చేస్తే చాలు ఎవ్వరు కూడా ప్రాథమికంగా తనిఖీ చేయరు అనే దీమాతో ప్రతి ఏడాది గట్టేక్కడం తప్పుడు లెక్కలతో పేద పిల్లల నోటికాడి బువ్వను లాక్కోవడం, వారికి క్రీడల కోసం ఖర్చు చేయకున్న చేసినట్లు తప్పుడుగా లెక్కలు రాయడం అనవాయితీగా వస్తుంది. మెయింటనేన్స్ నిధులలో జరిగిన దుర్వినియోగం మరెక్కడ కాదు అనేది జగ మెరిగిన సత్యం. ప్రతిసారి అడిట్ చేసే అధికారులకు అమ్యామ్యాలను ఇచ్చి వారు ఇచ్చిన రిపోర్టులు సక్రమంగా ఉన్నాయని చెప్పడం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఈ సారి జరిగే అడిట్ లెక్కలలో ఈ పరిస్థితి మారుతుందా లేదా అనేది వారం రోజులలో తేలిపోనుంది.

More articles

Latest article