- లింగంపేట్ లో ఆత్మగౌరవ గర్జన సభ
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలోని లింగంపేట్ మండల కేంద్రంలో జరిగే ఆత్మగౌరవ గర్జన సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తరలిరానున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన కోసం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 14న లింగంపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీ వివాదంలో మండల పార్టీ అధ్యక్షునికి జరిగిన అవమానంపై పరామర్శించేందుకు కేటీఆర్ రానున్నారు. ఈ సందర్భంగా లింగపేట్ మండల కేంద్రంలో జరిగే కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. కేటీఆర్ మీటింగ్ సక్సెస్ కోసం బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నారు. అయితే రెండు రోజులుగావర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జనసమీకరణ కార్నర్ మీటింగ్ నిర్వహణపై సందిగ్ధం కొలకొంది. కేటీఆర్ రాక మాత్రం ఖాయమైంది.
